Shardapith: విశాఖ శారదాపీఠం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి వేడుకలు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. దీప కాంతులతో రూపొందించిన జ్యోతిర్లింగార్చన శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివ స్వరూపుడు, ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహన్యాస పూర్వకంగా సాగిన ఈ అభిషేకంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు... 11 రకాల ద్రవ్యాలను వినియోగించారు. లింగోద్భవ కాలం దాటే వరకు దాదాపు మూడున్నర గంటల పాటు ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పరమేశ్వరునికి జ్యోతిర్లింగార్చన చేపట్టారు. తర్వాత చంద్రమౌళీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసి....రుద్రహోమం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. బ్రహ్మ ముహుర్తంలో హోమాలకు పూర్ణాహుతి చేశారు.
Visakha Beach: మరోవైపు విశాఖలో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉపవాస దీక్షలతో జాగారం చేసిన భక్తులంతా ఉదయం సముద్ర స్నానం ఆచరించడానికి బీచ్‌లకు చేరుకున్నారు. ఆర్కే బీచ్, ఋషికొండ, భీమిలి బీచ్‌ల్లో సముద్ర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరీ లోపలికి వెళ్లకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్నానాల తర్వాత బీచ్ సమీపంలోని కాళీమాత, విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Sivarathri in Srisailam: శ్రీశైలంలో కన్నులపండువగా ఆది దంపతుల కల్యాణం