ETV Bharat / city

ప్రధాని మోదీ మెచ్చిన విశాఖవాసి ఏబీసీ చార్ట్‌..

author img

By

Published : Dec 30, 2020, 10:58 PM IST

ఆత్మనిర్భర్​ భారత్​పై విశాఖ వాసి తయారు చేసిన చార్ట్​ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. విశాఖకు చెందిన వెంకట మురళీ ప్రసాద్‌.. ప్రధానికి రాసిన లేఖలో స్వదేశంలోనే తయారైనవే వినియోగించాలని.. అవి ఏయో వస్తువులనే చార్ట్‌ను రూపొందించారు. దీనిపై ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు.

pm narendra modi appreciate abc chart on man ki baat
ప్రధాని మోదీ మెచ్చిన విశాఖవాసి ఏబీసీ చార్ట్

రోజువారీ జీవితంలో వాడే వస్తువుల్లో విదేశాల్లో తయారైనవి కాకుండా స్వదేశంలోనే తయారైనవే వినియోగించాలని.. అవి ఏయో వస్తువులనే చార్ట్‌ను విశాఖకు చెందిన వెంకట మురళీ ప్రసాద్‌ తయారుచేశారు. ఇతను తయారు చేసిన ఆత్మనిర్భర్‌ భారత్‌ చార్ట్​ను ప్రధాని నరేంద్రమోదీ మెచ్చుకున్నారు. చార్ట్​తో కూడిన ఓ లేఖ అందిందని.. అది చాలా ఆసక్తికరంగా ఉందని సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రత్యేకించి ప్రస్తావించారు. ‘‘లేఖలో రాసినట్లు ‘ఏబీసీ’ అంటే తనకుముందుగా అర్థంకాలేదని.. ఆ తర్వాత మురళీప్రసాద్‌ జతచేసిన పట్టిక చూశాక అది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ చార్ట్‌’ అని అర్థమైందని మోదీ వెల్లడించారు.

పట్టికలో రోజువారీ ఏయో వస్తువులు వినియోగిస్తున్నారనేది కేటగిరీల వారీగా వివరించారు. ప్రతీరోజూ వాడే ఎలక్ట్రానిక్, స్టేషనరీ, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు ఇలా 49రకాల ఉత్పత్తుల్ని చార్టులో పేర్కొన్నారు. స్వదేశంలో దొరుకుతున్నప్పటికీ విదేశీ వస్తువులనే కొందరు ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. 2021లో స్వదేశీ వస్తువులనే వినియోగించేందుకు తాను ప్రమాణం చేస్తున్నానని మోదీకి రాసిన లేఖలో మురళీ ప్రసాద్‌ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల్ని, చార్డులోని వివరాల్ని మన్​కీబాత్​లో మోదీ ప్రస్తావించారు.

ఇదీ చదవండి: 'వచ్చే ఏడాది సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.