ETV Bharat / city

నేటి నుంచి విశాఖలో మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన - Pawan tour information

Janasena leaders: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కాసేపట్లో విశాఖలో ప్రారంభం కానుంది. పవన్ పర్యటనపై వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన వర్గాలు మాత్రం ఈ పర్యటన రెండు నెలల క్రితమే నిశ్చయమైందని పేర్కొంటున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్న విశాఖ గర్జన కార్యక్రమం.. ప్రభుత్వానిదా లేక వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీదా అని జనసేన నాయకులు నిలదీస్తున్నారు.

Pawan tour information
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన
author img

By

Published : Oct 15, 2022, 10:50 AM IST

Pawan Kalyan tour in Vishaka విశాఖ గర్జన కార్యక్రమం ప్రభుత్వానిదా లేక వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీదా అని జనసేన నాయకులు ప్రశ్నించారు. విశాఖ గర్జన కోసం మంత్రులు, ఎమ్మెల్యేలే జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయేతర జేఏసీగా చెబుతున్న నాయకులు.. జేఏసీ పోస్టర్లకు వైకాపా రంగులు ఎందుకు వేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. జనసేన అధినేత ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనపై వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితమే పవన్‌ కల్యాణ్‌ పర్యటన నిశ్చయమైందని, అది తెలియకుండా.. విశాఖ గర్జన సమయంలోనే వస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని జనసేన నేతలు అన్నారు. ఆదివారం.. విశాఖలోని పోర్ట్‌ కళావాణి స్టేడియంలో.. జనవాణి కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.