ETV Bharat / city

Suicide Attempt: అర్హత ఉన్నా అందని పింఛన్​​..వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం - Old Age Pensioner Suicide Attempt at visahaka news

Old Age Pensioner Suicide Attempt: అర్హత ఉన్న ఆ వృద్ధురాలికి పింఛన్ అందటం లేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. అధికారులు కనికరించలేదు. వృద్ధాప్యంలో 'నా' అనే వారు లేకపోగా.., ప్రభుత్వం ఆదుకోకపోవటంతో ఇక బతకటం వృథా అనుకుంది. రైలు కింద పడి బలవన్మరణానికి యత్నించింది. ఈ హృదయవిదారకర ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది.

suicide attempt
suicide attempt
author img

By

Published : Jan 4, 2022, 10:03 PM IST

వృద్ధరాలు ఆత్మహత్యాయత్నం

Old Age Pensioner Suicide Attempt: విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరానికి చెందిన శిరసాల లక్ష్మీ(70)కి గత 5 నెలలుగా పింఛన్​ అందటం లేదు. వేలిముద్రలు, ఐరిష్ పని చేయటం లేదని వృద్ధురాలి పింఛన్​ను అధికారులు నిలిపేశారు. నా అనే వారు లేక ఒంటరిగా జీవితం గడుపుతోన్న లక్ష్మీ.. పింఛన్​ కోసం సచివాలయం చుట్టూ రోజు కాళ్లరిగేలా తిరిగింది. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ.. ఫించన్​ను ఇవ్వటం లేదు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వృద్ధురాలు.. ఇక జీవించి లాభం లేదని లక్ష్మీదేవిపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వృద్ధురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

"ఐదు నెలలుగా పింఛను రావటం లేదు. నేను బతకలేను. నాకు పిల్లలు లేరు. ఇళ్లు కూడా లేదు. సచివాలయానికి వెళ్తే అధికారులు పట్టించుకోవటం లేదు. నన్ను చూసే వాళ్లెవరూ లేరు. ఈ వయసులో నేను బ్రతకటం వృథా. కళ్లు మూసుకొని రైల్వే ట్రాక్​పై పడుకుంటా" అంటూ వృద్ధురాలు దీనంగా వాపోవటం పలువురిని కంటతడి పెట్టించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంధువులకు అప్పగించారు.

ఇదీ చదవండి

Rape On Girl: బాలికపై అత్యాచారం.. పాఠశాలకు వెళ్తుండగా..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.