కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేశ్‌సింగ్ టికాయత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు జాతీయ రైతు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఒకపక్క కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడాతుంటే..భారీ పరిశ్రమల్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ఆలోచన చేయడం దారుణమన్నారు. అందరం కలిసి పోరాడి..ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీచదవండి
'ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని మానుకోవాలి'