ETV Bharat / city

విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ - vishakhapatnam news

విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా నియమితులైన మనీష్‌కుమార్‌ సిన్హా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ ఆర్కే మీనాను డీజీపీ కార్యాలయానికి బదిలీచేశారు. ఇంటిలిజెన్స్‌ ఐజీగా ఉన్న మనీష్‌కుమార్‌ సిన్హాకు విశాఖ సీపీగా నియమించిన సంగతి తెలిసిందే.

manish-kumar-sinha-has-taken-over-as-the-new-commissioner-of-police-for-visakhapatnam
విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Aug 17, 2020, 12:27 PM IST

విశాఖ నూతన పోలీస్ కమిషనర్​గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఆర్​కె మీనా డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో.. సిన్హాను విశాఖ నగర పోలీస్ కమిషనర్​గా ప్రభుత్వం నియమించింది. ఈ ఉదయం విశాఖ నగర పోలీస్ కమిషనరేట్​లో ఆర్​కె మీనా నుంచి మనీష్​కుమార్ సిన్హా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల సీపీ ఆర్కే మీనా ఏడాది పదవీకాలం పూర్తిచేశారు. బదిలీపై వెళ్లనున్న సీపీ మీనాకు పలువురు పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఐపీఎస్ 2000 బ్యాచ్​కు చెందిన మనీష్ కుమార్ సిన్హా కేంద్ర సీబీఐ, రాష్ట్ర ఇంటిలెజెంట్స్ విభాగంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేశారు. గతంలో ఉత్తరాంధ్రలో పోలీస్ అధికారిగా సేవలు అందించిన అనుభవం మనీష్ కుమార్ సిన్హాకు ఉంది.

ఇవీ చదవండి:విశాఖ సృష్టి ఆస్పత్రి కేసు.. 14 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.