ETV Bharat / city

ఎస్​ఈబీ తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ అక్రమ, నకిలీ మద్యం - కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత

రాష్ట్రంలో వేరు, వేరు చోట్ల అక్రమ, నకిలీ మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. విశాఖలో నకిలీ మద్యం రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తనిఖీల్లో 1362 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

liquor
liquor
author img

By

Published : Nov 29, 2020, 6:02 AM IST

తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ అక్రమ, నకిలీ మద్యం

విశాఖలో నకిలీ మద్యం రవాణా చేస్తున్న కేసులో స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో, నగర పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. గాజువాక మండలం వడ్లపూడి వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు భారీగా మద్యం, ఖాళీ సీసాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. కెమికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆ మద్యం తాగడానికి ప్రమాదకరమని తేల్చారు. ఈ కేసులో నిందితులను విచారించిన పోలీసులు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా ఒడిశాలోని బ్రహ్మపూర్​లో అతడిని అరెస్టు చేశారు. అక్రమ, నకిలీ మద్యం నిల్వలు కలిగి ఉన్నా లేదా సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ ఏడీసీపీ అజిత వేజండ్ల తెలిపారు.

కర్ణాటక మద్యం పట్టివేత
కర్ణాటక మద్యం పట్టివేత

కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎస్​ఈబీ అధికారుల దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 1362 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడినట్లు సీఈబీ సీఐ మహేశ్ కుమార్ తెలిపారు. తిమ్మాపురానికి చెందిన వెంకటేశ్, రచ్చుమర్రికి చెందిన మజ్జిగ బొజ్జప్ప, రామాంజనేయులు వేర్వేరుగా ద్విచక్ర వాహనాలపై అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అరెస్టు చేసి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.

ఇదీ చదవండి : దేవాదాయ ఆస్తులను అమ్మకుండా చట్టాలు చేయాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.