విశాఖ నగరం వేపగుంటలో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పండగపూట పస్తులు పెట్టడం ప్రభుత్వానికి తగదని ఆవేదన చెందారు. ఆరో జోన్ కార్యాలయం వద్ద భిక్షాటన చేస్తూ నిరసన చేశారు. కరోనా పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులకు జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి : 'పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు బ్యాంకర్ల సాయం కావాలి'