ETV Bharat / city

సింహగిరిపై రేపటి నుంచి ధనుర్మాసోత్సవాలు - విశాఖ సింహాచలం ఆలయం తాజా వార్తలు

సింహాద్రిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు జరిగే పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం ఆలయంలో స్వామివారి తిరువీధి సేవ జరుగనుంది.

dhanurmasostavalu
dhanurmasostavalu
author img

By

Published : Dec 15, 2020, 10:19 AM IST

విశాఖ సింహాచలం సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం 5.57 గంటలకు నెలగంట పెడతారన్నారు.

  • మంగళవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరిగే పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఆలయంలో స్వామివారి తిరువీధి సేవ..
  • 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం 5గంటలకు స్వామివారి తిరువీధి సేవ.
  • జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు సింహగిరిపై పవిత్ర గంగధార వద్ద స్వామివారి ధారోత్సవాలు. జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు స్వామి వారి నిత్యకల్యాణోత్సవం, ఆర్జిత సేవలు రద్దు.
  • జనవరి 13న సింహగిరిపై భోగి రోజున సాయంత్రం 5గంటల నుంచి గోదా కల్యాణం. ఆ రోజు గోదాదేవి కల్యాణంతోపాటే నిత్యకల్యాణోత్సవం.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టులో అధిక నీటి నిల్వ: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.