ETV Bharat / city

ఉక్కు కార్మికులకు హోటల్‌ గదులు ఇవ్వకుండా యజమానులపై ఒత్తిడి.. - దిల్లిలో ఉక్కు కార్మికుల నిరసన తాజా వార్తలు

విశాఖ ఉక్కు కార్మికులను దిల్లీ పోలీసులు వేధించారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2, 3 తేదీల్లో దిల్లీలో ఆందోళన చేపట్టడానికి వెళ్లిన వారిని...ప్రశ్నలతో బెదిరించారు. అన్నదాతల ధర్నాకు మద్దతు కోసం వచ్చారనుకొని... వారికి హోటల్‌ గదులు ఇవ్వకుండా యజమానులపై ఒత్తిడి తేవడంతో.. వారు రోడ్డుమీదే ఉన్నారు. ఎలా ఐనా తమ పోరాటం చేస్తామని .. కార్మికులు తెలిపారు.

delhi police are harassing to visakha steel plant employees
దిల్లిలో ఉక్కు కార్మికుల నిరసన
author img

By

Published : Aug 2, 2021, 7:12 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2, 3 తేదీల్లో దిల్లీలో ఆందోళన చేపట్టడానికి వస్తున్న స్టీల్‌ప్లాంటు ఉద్యోగులపై దిల్లీ పోలీసులు నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. ఆదివారం వచ్చిన కొందరు ఉద్యోగులను కొత్త దిల్లీ రైల్వేస్టేషన్‌ వద్దనే అడ్డుకొని విచారణ చేపట్టినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేత కేఎం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఉద్యోగులను నిర్బంధించిన పోలీసులు చివరకు జాతీయస్థాయి వామపక్ష నేతల జోక్యంతో వదిలేసినట్లు సమాచారం. దిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతివ్వడానికి వచ్చారన్న నెపంతో పోలీసులు వారిని నానా ప్రశ్నలు వేసి విసిగించారు. తాము ఉద్యోగులమని, స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీ వచ్చినట్లు చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బంది పెట్టారు.

చివరకు విడిచిపెట్టిన తర్వాత కూడా వీరికి హోటళ్లలో గదులు ఇవ్వొద్దని రైల్వేస్టేషన్‌ సమీపంలోని హోటల్‌ యజమానులందరికీ హుకుం జారీచేసినట్లు విశాఖ ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే వచ్చి హోటల్‌లో దిగినవారినీ ఖాళీ చేయించారని వాపోయారు. ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు కార్మికుల వద్దకు వచ్చి మీరు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడానికి వచ్చారంటూ తమను వేధించినట్లు ఉక్కు ఉద్యోగులు తెలిపారు. గదులు ఇవ్వకపోవడంతో తాము రోడ్డుపై ఉన్నామని, తమ పోరాటాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్‌ ఆరోపించారు. అయినాసరే 2, 3 తేదీల్లో తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

ఇదీ చూడండి.

VISHAKA STEEL FIGHT:దిల్లీలో ఉక్కు ఉద్యమ కార్మికులు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.