ETV Bharat / city

Steel plant: దేశ ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలపై.. విచారణ తగదు: కేంద్రం

author img

By

Published : Jul 28, 2021, 12:04 PM IST

Updated : Jul 28, 2021, 2:22 PM IST

Visakhapatnam steel plant
హైకోర్టు

12:00 July 28

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి... కౌంటర్‌ దాఖలు చేసిన కేంద్రం

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై దాఖలైన వ్యాజ్యంలో కేంద్రం కౌంటర్‌ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​లో కేంద్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోందని అఫిడవిట్​లో కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఉపసంహరణపై నిర్ణయం తీసుకుందని తెలిపింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని వివరించింది.

దేశ ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలపై కోర్టులో విచారణ చేయటం తగదని కేంద్రం అభ్యంతరం చెప్పింది. ఉపసంహరణ ప్రక్రియలో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉందని వివరించింది. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీ నారాయణ... విశాఖలో ఎంపీగా పోటీ చేశారని తెలిపింది. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిల్ దాఖలు చేశారని ఆరోపించింది. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్​లో కోరింది.

ఇదీ చూడండి:

పార్టీ నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం.. దేవినేని అరెస్ట్ అంశంపై చర్చ

Last Updated : Jul 28, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.