ETV Bharat / city

విజయసాయిరెడ్డి గారూ... పాదయాత్ర విశాఖలో కాదు దిల్లీలో చేయండి: బుద్దా వెంకన్న - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ

ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత బుద్దా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉక్కు పరిశ్రమ కోసం విశాఖలో పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. దిల్లీలో చేస్తే సమస్య కేంద్రానికి వినిపిస్తుందని హితవు పలికారు.

buddha venkanna slams mp vijay sai reddy
andhra pradesh panchayat elections
author img

By

Published : Feb 17, 2021, 4:16 PM IST

విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. దిల్లీలో ఆంధ్ర భవన్ నుంచి పార్లమెంట్ వరకూ లేదా మోదీ ఇంటి వరకూ పాదయాత్ర చేస్తే సమస్య కేంద్రానికి వినిపిస్తుందని హితవు పలికారు. సాయిరెడ్డిది పాదయాత్ర కాదు.. వాకింగ్ మాత్రమేనని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ముఖ్య సూత్రదారి విజయసాయిరెడ్డేనని విమర్శించారు. వైకాపా ఎంపీలు మొత్తం రాజీనామా చేసి స్పీకర్​కు పంపితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగుతుంది తప్ప విశాఖలో పాదయాత్ర చేస్తే సమస్య జిల్లా దాటదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

విశాఖ చేరుకున్న సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.