సకల సౌకర్యాలతో విలాసవంతంగా జీవించే వారు ఓవైపు.. కూడు, గూడు లేక పుట్‌పాత్‌లే ఆధారంగా కాలం వెల్లదీసే బతుకులు మరోవైపు. విశాఖలో ఎవరూ పట్టించుకోని అనాథలు, నిరాశ్రయులకు.. అన్నదమ్ములైన గంగరాజు, చిన్నారావు సేవలు చేస్తున్నారు. అనాథలు ఉన్న చోటకే వెళ్లి. .ఉచితంగా క్షవరం చేస్తూ తమ పెద్దమనసు చాటుకుంటున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గంగరాజు, చిన్నారావు.. 20ఏళ్ల క్రితం పనికోసం విశాఖ వచ్చారు. మహారాణిపేట పరిధిలోని పందిమెట్ట ప్రాంతంలో సెలూన్లు నిర్వహిస్తూ స్థిరపడ్డారు. తమకు ఉపాధి కల్పించిన విశాఖలో.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని సంకల్పించారు. అనాథల తలరాతలను మార్చలేకపోయినా.. కనీసం వారి జుట్టునైనా శుభ్రం చేయాలని భావించారు. తమ వృత్తికి సెలవురోజైన మంగళవారం ఆ సేవా కార్యక్రమం చేపడుతున్నారు. ఎంతో సంతృప్తినిస్తున్న ఈ సేవను.. తాము ఉన్నంత కాలం కొనసాగిస్తామని సోదరులిద్దరూ చెబుతున్నారు.
ఇదీ చదవండి
సెల్ఫీ వీడియో వైరల్: నేను కరోనాతో చనిపోతే.. బాధ్యత మా ఎస్సైదే