ETV Bharat / city

104 కూడలి బీఆర్టీఎస్​ రహదారిపై ప్రమాదం... ఇద్దరు మృతి

author img

By

Published : Sep 25, 2020, 11:00 PM IST

నగరంలోని 104 కూడలి బీఆర్టీఎస్​ రహదారిపై జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు.

bike accident at 104 area brts road
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. 104 కూడలి బీఆర్టీఎస్​ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్​ సమీపంలో ఓ ఈవెంట్​ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మర్రిపాలెంకు చెందిన నరసింహా (20) అనే వ్యక్తి ఈవెంట్​ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉంటాడు. గురువారం రాత్రి ఆర్కే బీచ్​ సమీపంలో ఓ ఈవెంట్​ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మర్రిపాలెం లక్ష్మీనగర్​ ప్రాంతానికి చెందిన గాడి సుధాకర్​(12)ను తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడుడు.

104 కూడలి వద్దకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో వాహనంపై వస్తున్న కట్టా శివ సూర్య(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుధాకర్​ మరణించాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు.

ఇదీ చదవండి :

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు… ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.