విజయమ్మను ఓడించినందుకు దేవుడు విధించిన శిక్షే హుద్ హుద్ అంటూ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టిన వైకాపా నాయకులు.... ఇప్పుడు విశాఖ పై కపట ప్రేమ నటిస్తున్నారు.. అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైకాపా నేతల ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదని... ఇక్కడి భూమిపై మాత్రమేనని ఆయన ఆరోపించారు.
విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చెరబట్టారని మండిపడ్డారు. 50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్ పై విజయసాయి కన్నుపడిందన్నారు. విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదలయ్యిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖను విజయసాయి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డాగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుబడిన వాళ్ళు తన వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న వాంగ్మూలం చూస్తే నవ్వొస్తోందని అయ్యన్న ఎద్దేవా చేశారు.