హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా రమేశ్ కుమార్ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాస్యాస్పదమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పదవీకాలం పూర్తయ్యే వరకు రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీం ఇప్పటికే తిరస్కరించిందన్నారు. నియామక అధికారం ఉన్న గవర్నర్‌ను కలవాలని హైకోర్టు రమేశ్ కుమార్కు సూచించిందని.. ధిక్కార పిటిషన్‌ను తిరస్కరించడం తప్ప హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ప్రభుత్వం వద్ద ఏ లాజిక్కూ లేదన్నారు. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం లెక్కచేయడంలేదని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి..