విజయవాడ భవానీపురంలో మంత్రి వెల్లంపల్లి అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు. షేక్ దావుద్ అనే టీ కొట్టు వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. టీ దుకాణం యజమాని షేక్ దావుద్ను ఖాజా అనుచరులు డబ్బులు ఇవ్వాలని దౌర్జన్యం చేయటంతో... డబ్బులు ఎందుకు ఇవ్వాలని టీ కొట్టు వ్యాపారి ప్రశ్నించాడు. ఖాజా అనుచరులు దుర్భాషలాడి, దాడికి పాల్పడినట్లు బాధితుడు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయొద్దంటు ఖాజా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫిర్యాదు దారుడుని బెదిరింపులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూస్తు ఉండిపోయారు.
ఇదీ చదవండి: వైకాపాకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం: అచ్చెన్నాయుడు