ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. 16వ తేదీ అర్ధరాత్రి నుంచి 25వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నగరంలోకి రాకుండా ఇతర మార్గాల ద్వారా పంపిస్తున్నారు. అలాగే గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలు, నగరంలో తిరిగే సిటీ బస్సులకు ట్రాఫిక్ పోలీసులు నిర్దేశిత మార్గాలను సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకు ప్రకాశం బ్యారేజీ మీదకు ఎటువంటి వాహనాలకు అనుమతివ్వడం లేదు.
భారీ, మధ్య తరహా రవాణా వాహనాలు:
విశాఖపట్నం - హైదరాబాద్
* విజయవాడ వైపునకు అనుమతించకుండా హనుమాన్ జంక్షన్- నూజివీడు-మైలవరం-జి.కొండూరు- ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు.
* హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను విజయవాడలోకి అనుమతించకుండా ఇబ్రహీంపట్నం-జి.కొండూరు-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్ మీదుగా పంపిస్తారు.
విశాఖపట్నం - చెన్నై
* విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు విజయవాడలోకి అనుమతించకుండా హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల-త్రోవగుంట మీదుగా పంపిస్తారు.
* చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద మళ్లించి చీరాల- బాపట్ల-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్‌జంక్షన్ మీదుగా పంపిస్తారు.
గుంటూరు - విశాఖపట్నం
* గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు విజయవాడ వైపు అనుమతించకుండా వాటిని బుడంపాడు వద్ద నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం పంపిస్తారు.
బస్సులు:
విజయవాడ -హైదరాబాద్ వైపు
* పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్-పీసీఆర్-చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు-బుడమేరు వంతెన-పైపులరోడ్డు- వై.వి.రావు ఎస్టేట్- చనమోలు వెంకట్రావు పైవంతెన -సితార- గొల్లపూడి వైజంక్షన్- ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు.
సిటీ బస్సులు (సిటీ బస్‌స్టాప్ నుంచి ఇబ్రహీంపట్నం మధ్య)
16 నుంచి 20వ తేదీ వరకు
* కంట్రోల్ రూమ్- ప్రకాశం విగ్రహం- లోబ్రిడ్జ్- గద్ద బొమ్మ - కే.ఆర్.మార్కెట్టు- పంజా సెంటర్- నెహ్రూచౌక్ - చిట్టినగర్- టన్నెల్- సితార- గొల్లపూడి- ఇబ్రహీంపట్నం.
* ఇబ్రహీంపట్నం - గొల్లపూడి - సితార - చనమోలు వెంకట్రావు పైవంతెన - చిట్టినగర్ - నెహ్రూచౌక్ - పంజాసెంటర్ - కే.ఆర్ మార్కెట్ - లోబ్రిడ్జ్ - ప్రకాశంవిగ్రహం -పోలీస్ కంట్రోల్ రూమ్ - సిటి బస్టాపు మీదుగా పంపిస్తారు.(మూలా నక్షత్రం రోజు మినహా)
21 నుంచి 25వ తేదీ వరకు
* బస్టాండ్ - పోలీస్ కంట్రోల్ రూమ్ - చల్లపల్లి బంగ్లా - ఏలూరు లాకులు - బుడమేరు వంతెన - పైపుల రోడ్డు- వై.వి.రావు ఎస్టేట్- చనమోలు వెంకట్రావు పైవంతెన- సితార- గొల్లపూడి వైజంక్షన్-ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు.
భక్తులు వచ్చే టూరిస్టు బస్సులకు:
* హైదరాబాద్-భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీసు రోడ్డు నుంచి పున్నమి హోటల్ వద్ద కుడివైపునకు తిరిగి పున్నమిఘాట్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
* విశాఖపట్నం-రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్‌రింగ్ రోడ్-పైపులరోడ్-వైవీరావు ఎస్టేట్- చనమోలు వెంకట్రావు పైవంతెన- సితార జంక్షన్- ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డు-పున్నమి హోటల్-పున్నమిఘాట్‌లో పార్క్ చేసుకోవాలి.
* గుంటూరు- వారధి - కృష్ణలంక పైవంతెన-ఆర్టీసీ ఇన్‌గేట్-దుర్గా పై వంతెన - స్వాతి జంక్షన్- వేంకటేశ్వర ఫౌండ్రి వద్ద యూటర్న్ తీసుకుని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడివైపు తిరిగి పున్నమి ఘాట్ వద్దనే వారి బస్సు ఎక్కాలి. తిరిగి వచ్చిన దారిలో వెళ్లాలి.