కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా గుట్కా వ్యాపారం కొనసాగుతుందని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్కు గుట్కా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడినుంచి విజయవాడకు తరలించి..నగరంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. గుంటూరు, తెనాలి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరకు రవాణా చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. విజయవాడలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి మారుస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల 90 వేల రూపాయల నగదు, నాలుగు వాహనాలు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా రవాణా చేస్తున్న ఎనిమిది మంది అరెస్టు - విజయవాడలో గుట్కా దందా వార్తలు
విజయవాడ నగరంలో విస్తృతంగా గుట్కా, ఖైనీ దందా కొనసాగుతోంది. నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 31 లక్షల 75 వేల రూపాయల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.