ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా యువతను ఒక తాటిపై తెచ్చేందుకు... తెలుగు యువత కృషి చేస్తోందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు అన్నారు. భూ దందాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియా కు వ్యతిరేకంగా పోరాడతామని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 15 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించామని.. మిగిలిన స్థానాలకు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: