వైద్యుడు సుధాకర్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిన విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించడంపై మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. వైకాపా అరాచక చర్యలను చాలా సార్లు కోర్టులు తప్పుబట్టినా జగన్మోహన్రెడ్డి వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. గతంలో విశాఖ పోలీసులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు మందలించినా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చేత తప్పులు చేయించి వారి ప్రతిష్టకు, వారి భవిష్యత్‌కు జగన్ మచ్చ తెచ్చారని ఆరోపించారు. ఇక నుంచైనా.. పోలీస్ వ్యవస్థ.. జగన్ ఒత్తిళ్ల ప్రకారం కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం