సంగం డెయిరీని ఏమీ చేయలేక డైరెక్టర్ల సమావేశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టాల్సి వస్తే, మాస్కు ధరించకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం పై రోజుకో కేసు నమోదు చేయాలని ఆక్షేపించారు. అక్రమాలకు పాల్పడిన నేతలపై కేసులు పెట్టకుండా... ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆనందయ్య మందును అనధికారికంగా అమ్ముకుందామనే ప్లాన్ను బయట పెట్టిన తెదేపా నేత సోమిరెడ్డి పై మరో తప్పుడు కేసు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు.
ఇదీచదవండి.
ఇదీ చదవండి: ఇరువర్గాల మధ్య ఘర్షణ... కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు