ETV Bharat / city

చదువుకున్నవారంటే.. ముఖ్యమంత్రికి ఎందుకంత కోపం: జవహర్

author img

By

Published : Mar 2, 2022, 5:47 PM IST

TDP Leader fires on CM Jagan: ఎంబీఏ, ఎంసీఏల చదివిన విద్యార్థులను.. 3, 4 రూపాయల వసూళ్ల కోసం మరుగుదొడ్ల బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి తీరు దారుణమని తెదేపా నేత జవహర్ మండిపడ్డారు. చదువుకున్నవారంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమని నిలదీశారు.

TDP Leader jawahar fires on CM Jagan over making degree students to collect money at sulabh complex
చదువుకున్నవారంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపం: జవహర్

TDP Leader fires on CM Jagan: తప్పుడు పాలన చేయడమే కాకుండా, తప్పులు మాట్లాడటం సీఎం జగన్‌కు ఫ్యాషనైపోయిందని.. మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఎంబీఏ, ఎంసీఏల చదివిన వారిని 3, 4 రూపాయల వసూళ్ల కోసం మరుగుదొడ్ల బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి తీరు దారుణమని మండిపడ్డారు. మరుగుదొడ్ల వద్ద యువతను కాపలాపెట్టిన వ్యక్తి, రేపు ఐఏఎస్ లతో చేయకూడని పనులు చేయిస్తారని విమర్శించారు. చదువుకున్నవారంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమని నిలదీశారు. నిరుద్యోగులకు డీఎస్సీ, ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైందో.. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తన అవినీతి కోసం సీఎం జగన్.. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద, పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని.. బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడానికి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థను నీరుగార్చారని దుయ్యబట్టారు. సచివాలయ సిబ్బందిని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. 25వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సంగతేమిటని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వలేని విభాగాన్ని.. ఉద్యోగం నుంచి తొలగించిన సవాంగ్ కు అప్పగించారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

మీ చిన్నాన్నను చంపిన వారు నీకు రెండు కళ్లా..? సీఎంపై తెదేపా నేతల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.