ETV Bharat / city

విద్యావ్యవస్థ పతనమయ్యేలా.. సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు: గోరంట్ల - విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్న గోరంట్ల

ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షలకోట్ల ఆస్తులను తాకట్టుపెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముందని.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా ముఖ్యమంత్రి జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

tdp leader gorantla buchaiah chowdary fires on ycp over aided schools issue
విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల
author img

By

Published : Nov 1, 2021, 5:31 PM IST

విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా ముఖ్యమంత్రి జగన్(cm jagan) మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి(tdp leader gorantla buchaiah chowdary) ధ్వజమెత్తారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థ(aided schools)ల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షలకోట్ల ఆస్తులను తాకట్టుపెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముందని విమర్శించారు.

లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో, తనకు ఓట్లేసిన క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలనే ముఖ్యమంత్రి రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన అన్ని జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడానికి.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులిస్తే, ప్రస్తుత సీఎం జగన్ వాటిని బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని తిడుతున్నా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రలు మండిపడుతున్నా, ముఖ్యమంత్రి తనవైఖరి మార్చుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

vizag steel plant: కేంద్రాన్ని ఒక్క ప్రశ్నా అడగలేదేం..? పవన్​ కు మంత్రి సీదిరి కౌంటర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.