ETV Bharat / city

Devineni: 'గోపిచంద్‌ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారమివ్వాలి' - దేవినేని ఉమా న్యూస్

కృష్ణా జిల్లా అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుదాఘాతంతో మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ కుటుంబాన్ని దేవినేని ఉమ పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని దేవినేని డిమాండ్ చేశారు.

'గోపీచంద్‌ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి'

author img

By

Published : Aug 26, 2021, 3:26 PM IST

కృష్ణా జిల్లా అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ కుటుంబాన్ని దేవినేని ఉమ పరామర్శించారు. విద్యార్థులతో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించటంపై మండిపడ్డ ఆయన...గోపిచంద్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థి మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా..అతని కుటుంబాన్ని పరామర్శించకపోవటం పట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. గోపిచంద్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గోపించంద్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, పలువురు తెదేపా నేతలు ఉన్నారు.

ఏం జరిగిందంటే...

కృష్ణా జిల్లా అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థి గోపీచంద్(15) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మరుగుదొడ్డిపైనున్న నీటిట్యాంకును శుభ్రం చేసే క్రమంలో గోపిచంద్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి చెప్పటం వల్లే గోపిచంద్ నీటి ట్యాంకు శుభ్రం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉపాధ్యాయులు సరిగా స్పందించలేదని.., గ్రామస్థులు వచ్చేవరకు పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతిచెందాడని బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు.

మంత్రి సురేశ్ ఆగ్రహం

గోపిచంద్ మృతి ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పాఠశాలల్లో విద్యార్థులను పనులకు వినియోగించటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్జేడీతో విచారణ చేయిస్తున్నట్టు వెల్లడించారు. ఘటనపై తక్షణమే ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నామని మంత్రి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పాఠశాలలో విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో పనులకు ఆయాల సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యార్థులతో పనులు చేయిస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించబోమన్నారు. మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.

ఇదీ చదవండి

జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. పదో తరగతి విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.