ETV Bharat / city

atchannaidu reacted on ots issue: ఓటీఎస్‌ పేరుతో సరికొత్త జగన్నాటకం: అచ్చెన్నాయుడు - ots issue in ap

ఓటీఎస్‌ పేరుతో సరికొత్త జగన్నాటకానికి జగన్‌ ప్రభుత్వం తెరలేపిందని, ఆ ఉచ్చులో పేదలు పడొద్దని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ కోసం లబ్దిదారులెవ్వరూ ఓటీఎస్‌ కింద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Nov 23, 2021, 9:14 AM IST

atchannaidu reacted on ots issue: దివాలా తీసిన రాష్ట్ర ఖజానాను నింపేందుకే జగన్‌ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో సరికొత్త జగన్నాటకానికి తెరలేపిందని, ఆ ఉచ్చులో పేదలు పడొద్దని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ కోసం లబ్దిదారులెవ్వరూ ఓటీఎస్‌ కింద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. తొలుత ఓటీఎస్‌ పథకం స్వచ్ఛందమని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని వాలంటీర్లతో ఒత్తిడి తేవడం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మరో అడుగు ముందుకేసి ఓటీఎస్‌ కింద ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోతే పెన్షన్లు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగటం దుర్మార్గమని సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

atchannaidu reacted on ots issue: 1983 నుంచి 2011 వరకు పేదలు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి రూ.పది వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తే.. రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడం పేద ప్రజలను మభ్య పెట్టడానికేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ.మూడు లక్షల వరకు ఉన్న పేదల ఇళ్ల బకాయిలు రద్దు చేస్తామని మాట ఇచ్చిన జగన్‌.. మరోమారు మాట తప్పి మడమ తిప్పి రూ.10 వేల కోసం పేదలను వేధిస్తున్నారని దుయ్యబట్టారు.

atchannaidu reacted on ots issue: ఒకసారి అర్హులుగా నిర్ణయించి మంజూరు చేసిన పెన్షన్లను రద్దుచేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయన్న అచ్చెన్న.... ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటీఎస్‌తో సంబంధం లేకుండా పేదల ఇళ్లన్నింటికీ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CBN Kadapa Tour: ఆ జిల్లాల వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.