ETV Bharat / city

ధర లేక పంటను వదిలేసిన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతు.! - టమాట పంట తాజా సమాచారం

TOMATO PRICES DOWN: ఆరుగాలం శ్రమించి టమాట పంట సాగు చేశారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటను పండించారు. తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్​లో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవు. దీంతో చేసేదేమి లేక ఓ రైతు పొలంలో పండిన టమాటాలను ఉచితంగా తెంపుకొండని గ్రామ ప్రజలకు ప్రకటించారు.

TOMATO
TOMATO
author img

By

Published : Mar 16, 2022, 8:13 PM IST

TOMATO PRICES DOWN: మార్కెట్లో కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వంద రూపాయలకు నాలుగు రకాల కూరగాయలైనా రావట్లేదు అయినా తప్పనిసరి పరిస్ధితుల్లో వినియోగదారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. ఇది కొనుగోలుదార్ల పరిస్థితైతే.. వాటిని పండించే రైతుల పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా టమాట ధరలు పడిపోతున్నాయి. దాంతో తెలంగాణలోని కుమురంభీం జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలో పండిన టమాటాలను ఉచితంగా తెంపుకొండని చుట్టు పక్కల ప్రజలకు ప్రకటించారు.

ఎంత కాసినా ఏం లాభం..

TOMATO PRICE: కుమురంభీం జిల్లా కెరమెరి మండలం ధనోర గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతు కేంద్రే బాలాజీ తనకున్న 5 ఎకరాల్లో వివిధ కూరగాయల పంటలను పండిస్తున్నారు. ఎకరంలో 50 వేల పెట్టుబడితో టమాటా సాగు చేశారు. పంట మంచి కాత కాస్తున్నా మార్కెట్​లో టమాటకు ధర లేదు. 28 కేజీల పెట్టెకు.. 20 రూపాయలు మాత్రమే వ్యాపారులు ఇస్తున్నారు. పంట పెట్టుబడికి తోడు కూలీ ఖర్చులు తడిసిమోపడువుతున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోగా.. పెట్రోల్, డీజిల్​ ధరలతో రవాణా ఖర్చులూ పెరిగాయి. దాంతో బాలాజీ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా టమాటను తీసుకెళ్లండని ఆవేదనతో ప్రకటించాడు.

ఇదీ చదవండి:Dengue Fevers in Nalgonda : ఊరంతా విషజ్వరాలే... లక్షలు ఖర్చుచేసినా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.