అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి.. నగరంలోని మూడు, నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ ఏజెంట్లుగా నేర చరిత్ర ఉన్న వారిని ఎంచుకోవద్దని చెప్పారు. అభ్యర్థులు ప్రతీకార చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ..
ఇటీవల పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు సేవలు అందించిన ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు తమ వంతు సేవలు అందించారని తెలిపారు. సర్టిఫికెట్తో పాటు నగదు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లాలో..
అర్హులైన ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ, పుర ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ వినుకొండ పట్టణంలో వినుకొండ పురపాలిక కమిషనర్ స్వీప్ రన్ నిర్వహించారు. నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురపాలక, మెప్మా , అంగన్వాడీ పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో..
జిల్లా ప్రత్యేక ఎన్నికల అధికారి క్రాంతి లాల్ దండే, సబ్ కలెక్టర్ తో కలిసి సాలూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇదీ చదవండి:
చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం.. ప్రలోభాలు, ఒత్తిళ్లే కారణమన్న విపక్షం