Salaries: ఆర్టీఐ కమిషనర్ల వేతనాలను పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన వేతనాన్ని ఆర్టీఐ కమిషనర్లకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్‌కు నెలకు రూ.2లక్షల 25వేలను వేతనంగా చెల్లించనున్నట్టు పరిపాలన శాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది.
అఖిలభారత సర్వీసు అధికారులకు చెల్లించినట్టుగానే.. కరవు భత్యం, సీసీఏ చెల్లింపులు , ఆర్జిత సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం 2005 సవరణ ప్రతిపాదనల కంటే ముందుగా ఆర్టీఐ కమిషనర్లుగా నియామకం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.