ETV Bharat / city

కరోనా సెకండ్ వేవ్​ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?

కరోనా విషయంలో ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మాట... సెకండ్‌ వేవ్‌. అసలే మాయదారి వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజల్లో...ఇది కొత్త కలవరం రేపుతోంది. అసలు ఈ సెకండ్ వేవ్‌ అంటే ఏంటి? తగ్గుతోంది అనుకుంటున్న కరోనా దాడి... మొదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా? పెరుగుతున్న కేసులతో మళ్లీ....లాక్‌డౌన్‌ విధిస్తోన్న దేశాల నుంచి వస్తోన్న సంకేతాలు ఏంటి? భారత్‌లో కూడా ఇంకొకసారి లాక్‌డౌన్‌ విధిస్తారా? ఇలా అన్నీ ప్రశ్నలే. కచ్చితంగా సమాధానం చెప్పేవారు మాత్రం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే... ప్రజారోగ్యరంగంలో సుదీర్ఘ అనుభవం, దిల్లీ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకు వివిధ హోదాల్లో సేవలందించిన డా. శ్రీనాథ్​‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

corona second wave
కరోనా సెకండ్ వేవ్​ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా
author img

By

Published : Oct 31, 2020, 9:52 PM IST

కరోనా సెకండ్ వేవ్​ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?
  • ప్ర: అసలు కరోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి? ఎందుకు ఆ పదం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది?
    జ: ఈ వైరస్ మెట్టమెుదట ప్రవేశించినపుడు దాని ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. దాని వల్ల ఎక్కువమంది ప్రభావితమైనపుడు సముద్రపు అలలాగా కనిపించిది. అది కొంతకాలం తగ్గినప్పటికీ మరోసారి పెరిగే అవకాశం ఉంది. మన అలవాట్లు, వాతావరణ మార్పులపై కరోనా వైరస్ వ్యాప్తి ఆధారపడే అవకాశం ఉంది.
  • ప్ర: కరోనా సెకండ్ వేవ్ మొదటిసారి కంటే తీవ్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిలో నిజానిజాలు ఎంత అంటారు?
    జ: అది సరైన భావన కాదు. దీనిని రెండు విధాలుగా చూడాల్సివస్తోంది. ఒకటి కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య క్రితం కంటే ఎక్కువగా ఉంటుందా లేదా చూడాలి. రెండవది మృతుల సంఖ్య ముందు కంటే ఎక్కువ ఉంటుందా లేదా అనేది పోల్చి చూసుకోవాలి. వైరస్​ను గుర్తించినపుడు చాలా దేశాల్లో లాక్​డౌన్ విధించారు. అది కఠినంగానే అమలుపరిచారు. ప్రస్తుతం అది కుదరదు. ప్రస్తుతం వైరస్ కారణంగా ఎక్కువమంది వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కానీ చాలా కారణాల వల్ల ఈ వ్యాధి తీవ్రత, మృతుల సంఖ్య అంత తీవ్రంగా ఉండదని భావిస్తున్నారు. యూరప్​లోనూ వైరస్​ బారిన పడిన వారి సంఖ్య పెరిగినప్పటికీ మృతల సంఖ్య పెరగటం లేదు. అందువల్ల సెకండ్ వేవ్ వల్ల కరోనా బాధితులు పెరిగినా...తీవ్రత ఎక్కువగా ఉండదని భావిస్తున్నాను.
  • ప్ర: దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది వైరస్. రెండోసారి కేసులు పెరగడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా?
    జ: దిల్లీలో ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించారు. అందువల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. జూన్​ అన్​లాక్ తర్వాత వైరస్ తీవ్రత పెరిగింది. ఆగస్టులో తగ్గుముఖం పట్టాయి. మళ్లీ పండుగుల సీజన్​లో ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించటం వల్ల కేసులు పెరిగాయి. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. దానివల్ల కేసులు పెరిగే అవకాశం ఉంటుంది.
  • ప్ర: ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే.. బ్రిటన్ లో ఇప్పుడు కరోనా రెండవ దశ ప్రతాపం చూపిస్తోంది. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు?
    జ: బ్రిటన్​ ప్రభుత్వం వైరస్​ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనివల్ల పెద్ద ఇబ్బంది లేదని..,ఇది ఫ్లూ వ్యాధికన్నా ఎక్కువ తీవ్రమైంది కాదని కొంతమంది నిపుణులు వారి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ వైరస్ తీవ్రత కారణంగా మృతులు పెరగటం వల్ల నివారణ చర్యలు తీసుకోవటం మెుదలుపెట్టారు. అది కొంచెం తగ్గుముఖం పట్టగానే...అంతా అయిపోయిందనే భావనతో ఎకానమీ పుంజుకోవాలనే ఆలోచనతో నిబంధనలు సడలించారు. దానివల్ల వైరస్ పెరగటానికి అవకాశం పెరిగింది. ఇప్పుడు మళ్లీ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.
  • ప్ర: జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి దేశాలు మళ్లీ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. అక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటారు?
    జ: లాక్​డౌన్ సడలింపులు వచ్చిన తర్వాత ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ దేశాల మధ్య ఆంతర్యాలు ఉన్నాయి. జర్మనీలో, డెన్మార్క్​లో వైరస్ తీవ్రత లేనప్పటికి...ముందు జాగ్రత్తగా నిబంధనలు విధిస్తున్నారు. ఫ్రాన్స్​లో చాలా కేసులు హెచ్చుగా ఉన్నాయి. యూరప్ దేశాల్లో మార్చి, ఏప్రిల్ మాసాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం చలికాలం సమీపించగానే కేసులు పెరుగుతున్నాయి. దీనిబట్టి వాతావరణ పరిస్థితులు, జన సామర్థ్యం వల్ల కేసులు పెరుగుతాయని తెలుస్తోంది. యూరప్ దేశాల్లో గత గుణపాఠాలు, అనుభవపూర్వకంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
  • ప్ర: లాక్‌డౌన్‌ ఎక్కడ విధించినా ప్రజల నుంచి మద్దతు కూడగట్టడం చిన్న విషయం కాదు. భారత్‌లో మరోమారు లాక్‌ డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు రావచ్చంటారా?
    జ: ప్రస్తుతం దేశంలో లాక్​డౌన్ విధించే పరిస్థితి లేదు. ఎందుకంటే లాక్​డౌన్ సామాన్యుల జీవితాల మీద ప్రభావం చూపుతోంది. మెుదట లాక్​డౌన్ విధించినపుడు వైరస్​ను ఎదుర్కోవటానికి మన వైద్య వ్యవస్థ పటిష్ఠం చేసుకోవటానికి, వైరస్​ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి పనికొచ్చింది. ఇప్పుడు మనం మనకున్న సాధానలతో వైరస్​ను ఎదుర్కోవాలి. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మాస్కులు ధరించి, జనావాసాల్లోకి రాకుండా చూసుకుంటే వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే మైక్రో కంటైయిన్​మెంట్ జోన్​లు విధించుకోవచ్చు. అంటే కేసులు ఉండే పరిసరాల్లో మాత్రమే లాక్​డౌన్ అమలు పరుచుకోవచ్చు. అంతే కానీ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ విధించే పరిస్థితి ప్రస్తుతం లేదు.
  • ప్ర: ఒకసారి కరోనా వచ్చిన వారికి మరోమారు వచ్చే అవకాశాలు ఉన్నాయా? దానిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
    జ: కరోనా వచ్చి నయమైన వారికి మళ్లీ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొంతమందిలో వైరస్ రీ ఇన్​ఫెక్షన్ వచ్చినట్లు.., మరికొంత మందిలో వేరే వ్యక్తి నుంచి వచ్చిన కొత్త వైరస్​తో మళ్లీ కరోనా సోకినట్లు వైరల్ జీనోమిక్ స్టడీస్ వల్ల తేలింది. రీ ఇన్​ఫెక్షన్ అయితే తప్పకుండా ఉంది. కానీ పెద్దఎత్తున లేదు. చాలా తక్కువ కేసులు ఉన్నాయి. వారిలోనూ చాలామందికి జబ్బు తీవ్రంగా సోకలేదు. కొంతమందికి రెండోసారి కరోనా వచ్చినా...లక్షణాలు కనిపించటం లేదు. మరికొంత మందికి రోగనిరోధక శక్తి, వయస్సు ప్రభావం వల్ల తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. రీ ఇన్​ఫెక్షన్ వల్ల పెద్ద ఎత్తున ప్రమాదం ఉండకపోవచ్చు.
  • ప్ర: వ్యాక్సిన్ మన దేశవ్యాప్తంగా ప్రజలు అందరికీ చేరటానికి ఎంతకాలం పట్టవచ్చని మీరు అంచనా వేస్తున్నారు?
    జ: వ్యాక్సిన్ వల్ల ప్రమాదం-ముప్పు ఉండదని తేలేవరకు ఏ వ్యాక్సిన్ వస్తుంది...,ఎప్పటి వరకు వస్తుందో కచ్ఛితంగా చెప్పలేము. వ్యాక్సిన్​పై ఆశలు పెట్టుకోవటంలో తప్పులేదు. కానీ ఫేజ్ త్రీ ట్రయల్స్ ముగిసేవరకు, వాటి ఫలితాలు వచ్చే వరకు చెప్పలేము. వ్యాక్సిన్ ట్రయల్స్​లో ముందంజలో ఉన్నవి నవంబర్​ ఆఖరుకు, లేదా డిసెంబర్ వరకల్లా అందిస్తామని చెబుతున్నారు. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాత వారికి రెగ్యులేటరీ అఫ్రూవల్ రావొచ్చు. కొంతమంది రెగ్యులేటరీ అఫ్రూవల్ దొరుకుతుందనే నమ్మకంతో ప్రొడక్షన్ మెుదలుపెట్టారు. కానీ అందరికి అందుబాటులోకి రావటానికి కొంత సమయం పట్టొచ్చు. భవిష్యత్తులో వైరస్ కారణంగా ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి అంటే వైద్యులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి మెుదటగా ఇస్తారు. తర్వాత జబ్బు తీవ్రంగా ఉన్నవారికి ఇవ్వొచ్చు. మాడో అంచెలో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు అందుబాటులోకి రావటానికి జూన్, జులై వరకు సమయం పట్టొచ్చు. అది కూడా సేఫ్ వ్యాక్సిన్ వస్తేనే.
  • ప్ర: వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన రిలాక్స్ గా ఉండే పరిస్థితి ఉందా? అక్కడితో కరోనా అంతం అయిపోతుందనే అనుకోవచ్చా?
    జ: వ్యాక్సిన్ కూడా రెండు రకాలు. ఇప్పటివరకు మనం చూస్తున్నవి శరీరంలో వైరస్ ప్రవేశించకుండా...,వ్యాధి తీవ్రతరం కాకుండా అరికట్టే వ్యాక్సిన్లు. పూర్తిగా కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆ వ్యాక్సిన్లు అదుపు చేయలేవు. మన ముక్కులోకి వైరస్ ప్రవేశిస్తే వాటిని తొలగించలేవు..కానీ మిగిలిన శరీర భాగంలోకి సోకకుండా అరికట్టవచ్చు. ఇన్​ఫెక్షన్స్ ఇంకా రావొచ్చు...,కానీ జబ్బు ఎక్కవ చేయదు. ఆ విధంగా రక్షణ ఉంటుంది. స్టెరిలైజింగ్ వ్యాక్సిన్స్​ అనే రెండోరకం వ్యాక్సిన్ల వల్ల ముక్కులోని వైరస్​ను బయటకు పంపించడానికి పనికొస్తాయి. అందులో ఉండే లోకల్ ఐజీఏ యాంటీబాడీస్ వైరస్​ను బయటకు పంపడానికి ఉపకరిస్తాయి. అటువంటి వ్యాక్సిన్లు​ పూర్తిగా ఇంకా క్లినికల్ ట్రయల్స్​లోకి రాలేదు. అవి ప్రాథమిక దశలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత ఇన్​ఫెక్షన్ రేట్స్ పూర్తిగా తగ్గకపోవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...వైరస్ తిరిగి విజృంభించే ప్రమాదం ఉంది.
  • ప్ర: సెకండ్ వేవ్​‌ రావటమే ఖాయం అయితే... దానిని ఎదుర్కోవటానికి మనదేశంలో రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగాలు ఏ విధంగా సన్నద్ధం కావాలి?
    జ: మెుదట వైరస్​ను గుర్తించినపుడు మనం ప్రాథమిక వ్యవస్థ మీద పెద్దగా శ్రద్ధ వహించలేదు. పెద్దాసుపత్రిలో వెంటిలేటర్స్ కావాలని అనుకున్నాం. కానీ...అవి చాలా తక్కువమందికి అవసరం..,వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదని విషయాన్ని గ్రహించలేదు. తర్వాత ఆ విషయంలో మనం తేరుకున్నాం. ఆసుపత్రుల్లో వైద్యసదుపాయాలు అన్ని ఉండేటట్లు చూసుకోవాలి. ఎవరికైనా జబ్బు లక్షణాలు కనబడితే వెంటనే గుర్తించటానికి ప్రాథమిక వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైరస్ లక్షణాలు గుర్తించగలిగితే మంచింది. రెండోది వెంటనే టెస్టింగ్ చేయించాలి. ఆలస్యం చేస్తే ఇన్​ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మెుదటిసారి నెగిటివ్​ వచ్చినంత మాత్రాన వైరస్ సోకలేదు అని అనుకోవటానికి వీల్లేదు. మూడు, నాలుగురోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తే వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మన ప్రాథమిక సేవలు బలంగా ఉండాలి. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రాథమిక సేవలు ముఖ్యం. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సచరించకుండా.., వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • ప్ర: ప్రస్తుతం పండుగల సీజన్, శుభకార్యాల సీజన్ ఈ పరిస్థితుల్లో ఎక్కువమంది ఒకేచోట గుమిగూడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రజలు ప్రభుత్వానికి ఏ రకంగా సహాయపడాల్సి ఉంటుంది ? మీ సూచనలేమిటి ?
    జ: పండుగలు, శుభకార్యాలు మనవారి క్షేమం కోసమే చేస్తాం. అలాంటప్పుడు ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఆరండభరంగా శుభకార్యాలు, పండుగలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది మనకు మన కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ముప్పు.
  • ప్ర: మొదట్లో లేదు లేదన్న కేంద్రం కూడా ఇప్పుడు సామాజికవ్యాప్తి విషయాన్ని అంగీకరిస్తోంది. ఇలాంటి తరుణంలో సెకండ్ వేవ్‌ అంటే... అంకెల పరంగా దీని తీవ్రత ఏ స్థాయిలో ఉండొచ్చు?
    జ: సెకండ్​ వేవ్​లో ఎంతమంది వైరస్​ బారిన పడతారనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మసులుకోగలితే ఆ వైరస్​కు త్వరగా వ్యాప్తి చెందే శక్తి ఉండదు. ఇప్పుడు ఎంతమందికి వస్తుందనేది చెప్పలేం. కానీ వచ్చే ఆర్నెళ్లల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే వైరస్ వ్యాప్తి పెరుగుతుంది.

ఇదీచదవండి

రాష్ట్రంలో 80 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.