ETV Bharat / city

విపత్కర పరిస్థితుల్లో సేవలు.. కొవిడ్ వారియర్స్​గా గుర్తించాలని వినతులు - కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలంటున్న ఆర్టీసీ ఉద్యోగులు

ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడంలో వారి కృషి వెలకట్టలేనిది. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నా.. ప్రాణాలను ఏమాత్రం లెక్క చెయకుండా సేవలందిస్తున్నారు. విధినిర్వహణలోనే వైరస్ బారిన పడి విగత జీవులవుతున్నారు. విపత్కర పరిస్ధితుల్లో సేవలందిస్తోన్న తమను కొవిడ్ వారియర్స్​గా గుర్తించాలని ఇస్తోన్న వినతులు బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోగా .. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. చాలా మంది విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు.

apsrtc
apsrtc
author img

By

Published : May 2, 2021, 6:11 PM IST

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ ఏపీఎస్ఆర్టీసీ. 53 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తూ నిరంతరం రోజుకు కోటిమందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉండాల్సి రావడంతో కరోనా వైరస్ బారిన పడుతున్నారు.

కరోనా బారిన పడుతోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 105 మంది ఉద్యోగులు కరోనాతో మృతిచెందారు. కరోనా ఉద్దృతంగా వ్యాప్తి చెందుతుండటంతో బస్సెక్కాలంటేనే సిబ్బంది జంతుకున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు.

వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కుటుంబాల పరిస్ధితి దయనీయంగా మారింది. వైద్య ఖర్చులకు అప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన కుటుంబాలు, కుటుంబ పెద్ద మృతితో మొత్తం రోడ్డున పడాల్సిన దుస్ధితి నెలకొంది. అప్పులపాలై ఆర్ధిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ గతంలో జరిగాయి.

ఆర్టీసీ కార్మికులను కొవిడ్ వారియర్స్​గా గుర్తించాలన్న కార్మికుల విజ్ఞప్తులు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. విధినిర్వహణలో కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతో సమానంగా 50 లక్షలు పరిహారం ఇవ్వాలని గతేడాది నుంచి ఆర్టీసీ కార్మికులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటూనే ఉన్నారు. కనీసం కొవిడ్ వారియర్స్​గా​ గుర్తించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సదుపాయం కల్పించకపోవడంతో గతేడాది ఆర్టీసీ కార్మికులే తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని జమ చేసి కొవిడ్తో​ చనిపోయిన సహచరుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం అందించారు. కేంద్రం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత సాయం వచ్చేలా చేస్తామని అప్పట్లో ఆర్భాటంగా చెప్పిన ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలయ్యాయి.

రెండో దశలో వ్యాప్తి తీవ్రంగా ఉండటం గతేడాది కంటే ఎక్కువ మంది వైరస్ బారిన పడుతుండటంతో కోవిడ్ వారియర్స్​గా తమను గుర్తించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కార్మిక సంఘాలు కోరాయి. నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి తమ కుటుంబాలు వీధిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

నిరతరం ప్రజల మధ్య తిరుగుతున్నందున ఆర్టీసీ కార్మికులు కొవిడ్ బారిన పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'సీఎం గారూ..కరోనాపై ప్రజలకు వాస్తవాలు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.