ETV Bharat / city

రీజినల్‌ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్​రెడ్డి - Telangana news

తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు.

రీజనల్‌ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతుంది

author img

By

Published : Feb 22, 2021, 8:13 PM IST

రీజనల్‌ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతుంది

హైదరాబాద్‌ వాసుల చిరకాల వాంఛ... రీజినల్‌ రింగ్‌రోడ్డు సాకారం కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రింగురోడ్డు అంశంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిశామన్న కిషన్‌ రెడ్డి... నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

సుమారు రూ.17వేల కోట్లతో కేంద్రం రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మించబోతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతో పాటు 20 పట్టణాలకు రింగురోడ్డు ఉపయుక్తం కానుందన్నారు. నూతన పెట్టుబడులు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల అభివృద్ధితో హైదరాబాద్‌ ముఖచిత్రమే మారిపోతుందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.