ETV Bharat / city

rahul murder case: 'కంపెనీని చౌకగా చేజిక్కించుకోవాలనే హత్యకు ప్రణాళిక'

author img

By

Published : Aug 24, 2021, 8:46 PM IST

Updated : Aug 25, 2021, 12:23 AM IST

విజయవాడ వ్యాపారి రాహుల్ హత్యకేసులో..కోగంటి సత్యం కీలకపాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. వాటా అమ్మకం విషయంలో.. రాహుల్, విజయ్‌కుమార్‌ మధ్య తలెత్తిన వివాదాన్ని సత్యం అనుకూలంగా మలుచుకుని.. కంపెనీని చౌకగా చేజిక్కించుకోవాలని.. ప్రణాళిక రచించినట్లు వివరించారు. ఇందుకు అంగీకరించనందుకే..రాహుల్‌ హత్యకు కుట్రపన్నారని నివేదికలో పోలీసులు తెలిపారు. విజయవాడలోని ఒకటో ఏసీఎమ్​ఎమ్​ కోర్టులో సత్యంను హాజరుపరిచారు.

Rahul murder case accused koganti satyam
రాహుల్ హత్య కేసు నిందితుడు కోగంటి సత్యం

రాహుల్, విజయ్‌కుమార్‌ మధ్య వివాదాన్ని అనుకూలంగా మార్చుకుని.. కంపెనీని తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు కోగంటి సత్యం పథకం వేశాడని.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. ఒంగోలుకు చెందిన రాహుల్.. ముగ్గురి భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా జీ.కొండూరులో ‘జిక్సిన్‌ సిలిండర్స్‌’ అనే కంపెనీ స్థాపించారని నివేదికలో వెల్లడించారు. ఇందులో రాహుల్‌కు 40 శాతం, విజయకుమార్‌కు 30 శాతం వాటా ఉందని వివరించారు. మిగిలిన 30 శాతంలో.. బొబ్బా రాహుల్‌ చౌదరి అనే వ్యక్తికి 20, బొబ్బా స్వామి కిరణ్‌కు 10 శాతం వాటా ఉందని తెలిపారు. కంపెనీ రోజువారీ వ్యవహారాలను రాహుల్ పర్యవేక్షించేవారు. ఇక విజయకుమార్‌.. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో డబ్బు ఖర్చు చేయడం వల్ల.. ఆర్థికంగా చితికిపోయాడని.. పోలీసులు రిపోర్ట్‌లో వివరించారు.

ప్రతిపాదన తిరస్కరించడంతో..

అప్పులిచ్చినవారి ఒత్తిళ్లతో.. కంపెనీలో తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాలంటూ.. రాహుల్‌ను కోరారని తెలిపారు. అందుకు రాహుల్ అంగీకరించకుండా.. వేరొకరిని సంప్రదించమని చెప్పారని..రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విజయకుమార్.. కోగంటి సత్యంను సలహా కోరారు. జిక్సిన్‌ కంపెనీలో 90 శాతం వాటా తనకు ఇచ్చేయాలన్న సత్యం.. నామమాత్రపు ధర నిర్ణయించాడని పోలీసులు నివేదికలో తెలిపారు. ఈ ప్రతిపాదనను రాహుల్‌ తిరస్కరించటంతో.. తీవ్ర ఒత్తిడి తెచ్చాడన్నారు. ఎంతకీ వినకపోయేసరికి.. రాహుల్‌ను విజయకుమార్, సత్యం బెదిరించారని పోలీసులు వివరించారు. అప్పటికీ ఫలితం లేక..రాహుల్‌ హత్యకు సత్యం కుట్ర పన్నాడని తెలిపారు. హత్యలో కోగంటి సత్యం పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కోగంటిపై విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసస్‌స్టేషన్లలో.. 24 క్రిమినల్‌ కేసులతో పాటు.. పటమట స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందని తెలిపారు. ఇంకా విచారించాల్సి ఉన్నందున జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించాలన్న పోలీసుల విఙ్ఞప్తితో... న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

బెంగుళూరులో చిక్కాడు..

అంతకుముందు.. పోలీసుల కళ్లుగప్పి విమానంలో బెంగళూరు పరారైన కోగంటి సత్యంను.. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యంను వారెంట్‌పై తీసుకెళ్లొచ్చన్న దేవనహళ్లి కోర్టు అనుమతితో.. విజయవాడకు పోలీసులు సత్యంను మంగళవారం ఉదయం కంపెనీకి సంబంధించి రుణం చెల్లింపు విషయంలో, వాటాల అమ్మకంపై విజయకుమార్, రాహుల్‌ మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తోడు గాయత్రికి తిరిగి ఇవ్వాల్సిన రూ. 6 కోట్లకు సంబంధించి మాట్లాడేందుకు రాహుల్‌ ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వచ్చారు. తొలుత.. విజయకుమార్‌ చిట్స్‌ కార్యాలయానికి వెళ్లినట్లు, అక్కడ చర్చల అనంతరం సత్యంకు చెందిన దుర్గాకళామందిర్‌ థియేటర్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ చాలా సేపు వాగ్వాదô జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆసమయంలో సత్యం కూడా అక్కడే ఉన్నాడని పోలీసులు గుర్తించారు . అనంతరం అక్కడి నుంచి కారులో హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వాహనంలోనే రాహుల్‌పై పిడిగుద్దులు కురిపించినట్లు సమాచారం. అనంతరం హత్య చేసి పరారయ్యారు. ఇందులో చిట్స్‌ కార్యాలయంలో, జిక్సిన్‌ కంపెనీలో పనిచేసే కొందరు హత్యకు పరోక్షంగా ,ప్రత్యక్షంగా సహకరించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారని తెలిసింది.

పోలీసుల అదుపులో ఉన్న మిగిలిన వారిని బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసులో ఎవరి పాత్ర ఏమిటి అన్న దానిపై ఇప్పటికే పోలీసులు స్పష్టతకు వచ్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి..

Dead body in Car case: రాహుల్ హత్య కేసు.. బెంగళూరులో చిక్కిన మరో నిందితుడు

Last Updated : Aug 25, 2021, 12:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.