గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న వాగులు పొంగి వరద నీరు ఉద్ధృతంగా వస్తున్న కారణంగా.. బ్యారేజీ నుంచి 30 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. పాలేరు, కీసర, మున్నేరు, కట్టలేరు తదితర కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి అధికంగా నీరు వచ్చి చేరుతున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం 21, 750 క్యూసెక్కుల వరకు వరద నీరు సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బ్యారేజీకి వరద నీరు పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. అదే గనుక జరిగితే 42 గేట్లు తెరచి దిగువకు నీరు వదిలేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి:
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఐదు గేట్లు ఎత్తివేత