ETV Bharat / city

యజమాని నమ్మకమే దొంగతనానికి పెట్టుబడి..! - Vijayawada Crime news

విజయవాడ నగరంలో భారీగా బంగారం దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ తర్వాత నిందితుడు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు పోలీసులనూ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎవరికీ అనుమానం వ్యవహరించిన తీరు ఓ సినిమా స్టోరీని గుర్తుచేసింది. ఎట్టకేలకు నిందితున్ని పట్టుకోవడంతో... యజమాని ఊపిరి పీల్చుకున్నారు.

యజమాని నమ్మకమే దొంగతనానికి పెట్టుబడి
యజమాని నమ్మకమే దొంగతనానికి పెట్టుబడి
author img

By

Published : May 1, 2021, 8:39 PM IST

పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు

విజయవాడ గవర్నర్‌పేటలోని రాహుల్‌ జువెలరీ దుకాణంలో పనిచేస్తూ... తన యజమాని కళ్లుగప్పి భారీ మొత్తంలో బంగారం ఆభరణాలు దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న మధ్యాహ్నం బంగారం దుకాణం ఉద్యోగి వెంకటహర్ష.. యజమానికి తెలియకుండా రెండు బ్యాగ్‌ల నిండా ఉన్న సుమారు పది కేజీల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యాడు.

స్పెషల్ టీం ఏర్పాటు..

దుకాణ యజమాని మహావీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌, క్రైం ఏడీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌ పర్యవేక్షణలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పెనమలూరు మండలం తాడిగడప డొంకరోడ్డు పరిసరాల్లో హర్ష సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో సీసీఎస్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సీపీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

పది వరకే చదివినా...

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి వెంకటహర్ష పదో తరగతి వరకు చదివాడు. తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. తన పెద్దమ్మ వద్ద ఉంటూ బంగారం దుకాణాల్లో పనిచేసిన అనుభవంతో విజయవాడ వచ్చారు. ఏడాదిగా రాహుల్‌ బంగారం దుకాణంలో పనిచేస్తున్నారు. దుకాణ యజమాని హర్షను పూర్తిగా నమ్మి... తన ఇంటి నుంచి బంగారం తీసుకురావడం.. తీసుకెళ్లడం..బ్యాంకు లావాదేవీల నిర్వహణ పనులు అప్పగించారు.

యజమాని నమ్మకమే కొంప ముంచింది..

యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ దొంగతనానికి పాల్పడి... ఎక్కడికైనా భార్య పిల్లలతో వెళ్లిపోయి స్థిరపడాలని నిందితుడు హర్ష భావించినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. దొంగతనం అనంతరం దొరక్కుండా ఉండేందుకు నిందితుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని... ఈ క్రమంలో ముందుగానే తన ఇళ్లు ఖాళీ చేసి తన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా చూసుకున్నాడని... తన ఫోటోలు, చిరునామా, ఇతర వివరాలు దుకాణంలో లేకుండా చేసి... స్నేహితులకు... బంధువులకు తన నివాసం తెలియకుండా ఉండేందుకు గతనెల 18న కృష్ణలంక రాణీగారితోటలోని ఉంటోన్న నివాసాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేసి తొడిగడప డొంకరోడ్డులో ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడికి మారాడని చెప్పారు.

అనుమానం రాకుండా..

తన భార్య, ఏడు నెలల కుమారుడు, పెద్దమ్మను ఆ ఇంట్లో ఉంచి... యథాప్రకారం దుకాణానికి వెళ్తూ ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నాడని... దుకాణ యజమాని ఇంటి నుంచి బంగారు ఆభరణాల సంచులను తీసుకుని తన కదలికలను పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు షేర్‌ ఆటోలో విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడని సీపీ వివరించారు.

ఖాళీ చెక్కుపై ఫోర్జరీ సంతకం..

ఈ బంగారు వస్తువులతో వేరే రాష్ట్రానికి వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకుని.. అందుకు కావాల్సిన నగదు కోసం తాను దొంగిలించిన నగలను విజయవాడలో కాకుండా వేరేచోట విక్రయించాలని భావించాడని సీపీ చెప్పారు. తన యజమాని వద్ద దొంగిలించిన ఐడీబీఐ బ్యాంకు ఖాళీ చెక్కుపై యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి తన ఖాతాలోకి నాలుగు లక్షల 60 వేల రూపాయలు ఆర్టీజీఎస్ చేసి... మధ్యాహ్నం ఒంటి గంటకు పోరంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి తన సెల్ఫ్‌ చెక్కుతో ఆ మొత్తాన్ని డ్రా చేసుకుని తన ఇంట్లో ఉంచుకున్నాడని వివరించారు.

48 గంటల్లో స్టోరీ క్లోజ్..!

నిందితుడు విజయవాడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తోన్న సమయంలో... అతన్ని అరెస్టు చేసినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో దొంగిలించిన పది కేజీల బంగారం వస్తువులు... బ్యాంకు నుంచి ఫోర్జరీ చేసి డ్రా చేసిన నాలుగు లక్షల 60 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ సొత్తు విలువ సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. భారీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 48 గంటల్లో పట్టుకున్నందుకు సీసీఎస్‌, గవర్నర్‌పేట పోలీసులు,అధికారులను పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు అభినందించారు.

ఇదీ చదవండి:

రేపే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.