అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని 2021 ఆగస్టు 26 తేదీ నుంచి 2023 ఆగస్టు 25 తేదీ వరకూ పొడిగిస్తూ సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలిచ్చారు.
ఈ నెల 26 న ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టులో నియమితులైన యార్లగడ్డ.. గత రెండేళ్లుగా అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి:
Pulichintala: పులిచింతలలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం