విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి ఘటనలో మరో ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించి వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. తాజాగా నోటీసులు ఇచ్చిన వారిలో గుణదలకు చెందిన సంగపు చెన్నకేశవరావు, శిఖామణి సెంటర్‌కు చెందిన మేడిశెట్టి రాజశేఖర్, ఉడ్‌పేటకు చెందిన సొంగా చందన్, మొగలజాపురానికి చెందిన ఇట్ల సురేష్, క్రీస్తురాజపురానికి చెందిన శిఖ రంజిత్‌కుమార్, దుర్గా అగ్రహారానికి చెందిన నామవరపు యశోద, కృష్ణలంకకు చెందిన మొరకలనపల్లి ఆదిలక్ష్మి ఉన్నట్లు డీసీపీ హర్షవర్దనరాజు తెలిపారు. ఈనెల 19వ తేదీన పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు మొత్తం 18 మంది నిందితులను గుర్తించారు.
ఇదీ చదవండి: ARREST: పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు