ETV Bharat / city

గ్యాంగ్ వార్ : మరో తొమ్మిది మంది అరెస్ట్ - విజయవాడ గ్యాంగ్ వార్ లెటెస్ట్ అప్​డేట్

విజయవాడలో సంచలనం రేపిన గ్యాంగ్​వార్​ కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 33కు చేరింది. మొత్తం 50 మంది ఈ వివాదంలో పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

గ్యాంగ్ వార్ : మరో తొమ్మిది మంది అరెస్ట్

author img

By

Published : Jun 10, 2020, 9:57 PM IST

విజయవాడలో సంచలనం రేపిన గ్యాంగ్​వార్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కేసుకు సంబంధించి మరో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పండు గ్యాంగ్ నుంచి 11 మంది, సందీప్ గ్యాంగ్ నుంచి 13 మంది నిందితులను కటాకటాల్లోకి నెట్టారు. తాజా అరెస్టు​లతో పోలీసుల అదుపులో మొత్తం 33 మంది ఉన్నారు.

మణికంఠం పండు వర్గానికి చెందిన షేక్ హుస్సేన్, పటాన్ మహబూబ్ బాషా, యలగంటి ఈశ్వరరావు, నల్లూరి నవీన్ బాబు, అబ్దుల్ బాజీ... తోట సందీప్ వర్గానికి చెందిన నగవరపు వెంకటేశ్వరరావు, బత్తినేని వెంకట ఆనందకృష్ణ, గుండు దుర్గానాగప్రసాద్, కట్టా నాగరాజులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.

నిందితుల నుంచి సైడర్ బ్లేడులు, స్నేప్ బ్లేడులు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని పోలీసులు నిర్ధరించారు. ఒక గ్యాంగ్​కు ప్రధాన సూత్రధారి అయిన పండు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం కుదుటపడగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయనున్నారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం పండు నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసుల కస్టడీకి అడిగే అవకాశముందని సమాచారం.

సంబంధిత కథనాలు :

విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు

విజయవాడలో గ్యాంగ్ వార్..ఏం జరిగిందంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.