Nara lokesh criticizes Minister Mekapati : కళ్లు మూసుకుని పాలు తాగుతూ... తనను ఎవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టుగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వ్యవహారం ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. దుబాయ్ ఎక్స్‌పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని.. ఎవరికీ తెలియదని అనుకుంటున్నారని విమర్శించారు.
రూ.3 లక్షలు కూడా లేని కంపెనీ రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెడుతామన్న లోగుట్టుని..ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని తెదేపా బయటపెట్టిందని ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి, ప్రభుత్వ పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడం లేదని లోకేశ్ విమర్శించారు.
-
కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు...దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి @MekapatiGoutham గారు.(1/2) pic.twitter.com/JodguSBgBT
— Lokesh Nara (@naralokesh) February 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు...దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి @MekapatiGoutham గారు.(1/2) pic.twitter.com/JodguSBgBT
— Lokesh Nara (@naralokesh) February 18, 2022కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు...దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి @MekapatiGoutham గారు.(1/2) pic.twitter.com/JodguSBgBT
— Lokesh Nara (@naralokesh) February 18, 2022
ప్రపంచమే రాష్ట్రం వైపు జాలిగా చూస్తోంది..
దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్‌రెడ్డి... మూడేళ్లు పూర్తి కాకుండానే ప్రపంచమే రాష్ట్రం వైపు జాలిగా చూసేంత ఆధ్వానంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్‌గా ఉన్న ఏపీని.. ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ రెడ్డి ఏడో స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు.
-
దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న @ysjagan గారు,మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ,ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు.@ncbn గారి హయాంలో ఉద్యోగావకాశాలకు no.1 గా వున్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారు(1/3) pic.twitter.com/sQb4WbDNQB
— Lokesh Nara (@naralokesh) February 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న @ysjagan గారు,మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ,ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు.@ncbn గారి హయాంలో ఉద్యోగావకాశాలకు no.1 గా వున్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారు(1/3) pic.twitter.com/sQb4WbDNQB
— Lokesh Nara (@naralokesh) February 18, 2022దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న @ysjagan గారు,మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ,ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు.@ncbn గారి హయాంలో ఉద్యోగావకాశాలకు no.1 గా వున్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారు(1/3) pic.twitter.com/sQb4WbDNQB
— Lokesh Nara (@naralokesh) February 18, 2022
కియా వాళ్లని బెదిరించినంత సులభం కాదు..
ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక-2022 వెల్లడించిందని వివరాలు బయటపెట్టారు. ఈ నివేదిక చూసి జగన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పన అంటే తన కుటుంబానికి, కులానికి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రఖ్యాత కంపెనీలు రప్పించాలంటే కియా వాళ్లని బెదిరించినంత.. సులభం కాదన్న లోకేశ్... విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమంటే ముఖ్యమంత్రి ప్రజావేదిక కూల్చినంత సులువు కాదని విమర్శించారు.
ఇదీ చదవండి :
ఖాళీ కుర్చీలకు చెప్పేందుకు గౌతంరెడ్డి అబుదాబి వరకు వెళ్లాలా..?: లోకేశ్