కృష్ణా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో.. ఆరోగ్యశ్రీకి కేటాయించిన పడకల వివరాలు ప్రముఖంగా ప్రదర్శించాలని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సూచించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో.. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి జిల్లా పాలనాధికారితో సమావేశం అయ్యారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల భాదితులకు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: 'ఎంపీ రఘురామ కృష్ణరాజు సవాల్‌కు సీఎం జగన్ సిద్ధమా ?'
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని.. అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావాల్సి ఉందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించకుండా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవరించాలని సూచించారు. జిల్లాలో అవకతవకలకు పాల్పడిన నాలుగు ఆస్పత్రులకు అపరాధ రుసుము విధించడం, అనుమతులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు మంత్రికి కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి: