రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వొద్దనడం సబబు కాదని, కొంత మందే రాజధానిలో ఉండాలనుకోవడం సరైనది కాదనేది నాని భావనగా పేర్కొన్నారని... ఇది కేవలం మంత్రి నాని అభిప్రాయం మాత్రమేనని మంత్రి బొత్స అన్నారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తప్పిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని... కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి నిలిపివేయించారని... మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ మధురానగర్‌లో ఆర్ యూ బీ నిర్మాణానికి... స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి బొత్స శంకుస్థాపన చేశారు. మధురానగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని... ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి... వంతెన పనులకు నిధులు మంజూరు చేయించామన్నారు. ఆరు నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. ప్రతినెల విజయవాడ నగరంలో ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.
ఇదీ చదవండి: వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్ కుమార్