నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో అధికారులు వైద్య పరీక్షలను నిర్వహించారు. ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం ఆయనకు మెడికల్ పరీక్షలను పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిర్వహణను వీడియోలో చిత్రీకరించారు. సైనిక ఆస్పత్రి వైద్య పరీక్షలపై ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల నివేదికను సీల్డు కవర్‌లో రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా సర్వోన్నత ధర్మాసనానికి అందజేయనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో రఘురామ కుమారుడు భరత్ సికింద్రాబాద్లోని మిలటరీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అధికారులు ఆయనను లోనికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. ప్రస్తుతం ఎంపీ మిలటరీ ఆసుపత్రిలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర హైకోర్టు.. జ్యుడీషియల్ అధికారిని నియమించింది. రిజిస్ట్రార్ నాగార్జున జ్యుడీషియల్ అధికారిగా వ్యవహరించారు. సుప్రీం తదుపరి ఆదేశాల వరకు రఘురామ సైనిక ఆస్పత్రిలో ఉండనున్నారు.
ఇదీచదవండి: చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంచలన నిర్ణయం
రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం.. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణ