ETV Bharat / city

'మన నుడి-మన నది ఉద్యమానికి అంతా కలిసి రావాలి'

జనసేన అధ్యక్షుడు పవన్​తో మండలి బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ అయ్యారు. పవన్​కళ్యాణ్ 'మన నుడి-మన నది' ఉద్యమానికి మద్దతు తెలిపారు.

mandali buddhaprasad and jonnavitthula meets pawan kalyan
author img

By

Published : Nov 23, 2019, 6:19 PM IST

హైదరాబాద్​లోని జనసేన పార్టీ కార్యాలయంలో... పవన్​కళ్యాణ్​తో మండలి బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ అయ్యారు. మాతృభాష పరిరక్షణ కోసం పవన్ నడుంబిగించారని బుద్ధప్రసాద్ అభినందించారు. భాష మనుగడకు ఉద్యమించాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించిందని ఆరోపించారు. ఈ సవాలును ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొల్పాలని... భాషాభిమానులంతా ఒకే వేదికపైకి రావాలని బుద్ధప్రసాద్ కోరారు.

భాషాభిమానులంతా పవన్​కళ్యాణ్​తో కలసిరావాలని జొన్నవిత్తుల అన్నారు. మాతృభాష సంరక్షణకు పవన్ బలమైన సంకల్పంతో ఉన్నారని కొనియాడారు. భాష పరిరక్షణ, నదుల కాలుష్యం నివారణకు జనసేనాని కంకణం కట్టుకున్నారన్నారు. ప్రకృతి, భాషా ప్రేమికులు, పండితులు, కవులు కలసి రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: త్వరలో 'మన నుడి- మన నది' కార్యక్రమం: పవన్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.