ETV Bharat / city

దిల్లీలో రైతులకు మద్దతుగా 26న ట్రాక్టర్ ర్యాలీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న దిల్లీలో రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరగబోయే ట్రాక్టర్ ర్యాలీకి మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని అన్ని ముఖ్య కేంద్రాలలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపాయి.

mahila sangala tractor rally
ఈనెల 26న దిల్లీలో రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ !
author img

By

Published : Jan 22, 2021, 7:07 PM IST

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ... దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఈ నెల 26న దిల్లీలో రైతు సంఘాల నేతలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మహిళా సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాల్లో మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గుంటూరులో...

గుంటూరులో రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. బీఆర్ స్టేడియం నుంచి చుట్టుగుంట వరకు ఈ ర్యాలీ సాగింది. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ.. ఈ నెల 26న దిల్లీలో రైతు సంఘాలు చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ర్యాలీలు చేపట్టనున్నట్లు మహిళా సంఘాలు తెలిపాయి.

ఈనెల 26న దిల్లీలో రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ !

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.