ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైభవంగా సాగిన మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్ బాబు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు కృష్ణా నదిలో శ్రీ గంగా పార్వతి మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు.
ఇదీ చదవండి...