కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీపై శాంతిపురం మండల వైకాపా నేత చేయి చేసుకుంటే.. పోలీసు అధికారుల సంఘం కనీసం ఖండించలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పోలీసు అధికారుల సంఘం నాయకులు శ్రీనివాసరావు.. తెలుగుదేశం నేతలపైనే మీసం తిప్పుతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలైతే ఆయన మీసం తిరగదా? అని లోకేశ్ నిలదీశారు. సీఐపై దాడి విషయమై పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో చూడాలన్నారు.
ఇదీ చదవండి..
Badvel: పోటాపోటీగా ప్రచారం.. విమర్శలతో పదునెక్కిస్తున్న వైకాపా, భాజపా