ETV Bharat / city

wedding invitation viral: దృశ్యరూపంలో పెళ్లి పత్రిక... సామాజిక మాధ్యమాల్లో వైరల్​ - పెళ్లి ఆహ్వాన వీడియో

Wedding Invitation Video Viral : వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులను వినూత్నంగా ఆహ్వానించడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఖమ్మం జిల్లా సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌కి.. మనీషా అనే అమ్మాయితో వివాహం నిశ్చయమయ్యింది. వారి పెళ్లికి ఆహ్వాన పత్రికను దృశ్యరూపంలో రూపకల్పన చేసి కవితాత్మకంగా వర్ణించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Wedding Invitation Video Viral
దృశ్యరూపంలో పెళ్లి పత్రిక
author img

By

Published : Feb 9, 2022, 9:47 AM IST

Wedding Invitation Video Viral : ప్రేమ కథతో పెళ్లి ఆహ్వానం ఏమిటి అని అనుకుంటున్నారా..? అవును నిజమేనండి.. ఓ యువ ఐఏఎస్‌ అధికారి బంధువులు, మిత్రులు, ప్రముఖులకు తన ప్రేమ కథను వివరిస్తూ రూపొందించిన యానిమేషన్‌ వీడియో పంపుతూ తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Collector Wedding Invitation Video Viral : ఆ వీడియోలో బస్సులో ప్రారంభమైన తమ ప్రేమను.. ఓ గుడిలో కలుసుకుని ఎలా వ్యక్తపరచుకున్నారు.. పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విధం.. ఈ నెల 10న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నామని పేర్కొని ‘తమ పెళ్లికి హాజరై.. ఆశీర్వదించాలని..’ వీడియోలో కోరారు. ఇంతకు ఎవరా యువ ఐఏఎస్‌ అనుకుంటున్నారా.. ఆయన ఖమ్మం జిల్లా సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్న పేట జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మనీషాతో తన ప్రేమ కథ.. పెళ్లి వరకు సాగిన ప్రయాణంపై వీడియో రూపొందించారు. రాహుల్-మనీషాల ప్రేమకథేంటో మీకూ తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చూసేయండి మరి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.