ETV Bharat / city

వైద్యారోగ్య శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ

author img

By

Published : May 23, 2020, 10:42 PM IST

వైద్యారోగ్యశాఖలో 9 వేల700కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు... ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

వైద్యారోగ్యశాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ'
వైద్యారోగ్యశాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ'

త్వరలో 9,700కు పైగా డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైళ్లు, విమానాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. హైరిస్క్ ప్రాంతాలైన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నట్టు జవహర్ పేర్కొన్నారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఆదివారానికి కరోనా టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.