అశ్వయుజ మాసం ఆఖరి ఆదివారం కావడంతో.. ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఘాట్ రోడ్డుతో పాటు కనకదుర్గనగర్ కూడా భక్తులతో సందడిగా మారింది. ఓం టర్నింగ్ వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనం క్యూలైన్లతో పాటు వంద రూపాయలు, 300 రూపాయల లైన్లు సైతం భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానివేదన సమయం కావడంతో... భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది.
ఇదీ చదవండి:దుర్గగుడి చీరల కౌంటర్ నిర్వహణపై విచారణ !