ETV Bharat / city

కరోనాతో గుండెకూ పెనుముప్పు - corona virus chenges

కరోనా రెండో దశలో ఎక్కువగా 25-30 ఏళ్ల వారే అధికంగా చనిపోతున్నారు. కొందరు కరోనా తగ్గి.. ఇంటికి వెళ్లి మందులు వాడుతూ కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.కరోనా వచ్చిన వారిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని తొలి దశలోనే వైద్యులు గుర్తించారు. అసలు అలా జరగటానకి గల కారణాలేంటి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? వంటి వాటి గురించి నిపుణుల సూచనలు.

heart
కరోనాతో గుండెకూ పెనుముప్పు
author img

By

Published : May 4, 2021, 9:20 AM IST

రోనా తొలి దశలో 60 ఏళ్లు దాటినవారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ఎక్కువగా మరణించారు. రెండో దశలో 25, 30 ఏళ్ల యువకులు ఎక్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. కొందరు కరోనా తగ్గి.. ఇంటికి వెళ్లి మందులు వాడుతూ కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. కొందరు రోగుల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం (థ్రాంబోసిస్‌) వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని కరోనా తొలి దశలోనే వైద్యులు గుర్తించారు. హెపారిన్‌, ఎకోస్ప్రిన్‌ వంటి రక్తాన్ని పలుచగా ఉంచే మందులను ఇవ్వడం కరోనా చికిత్సలో భాగం చేశారు. అయినా కూడా గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న రోగుల సంఖ్య రెండో దశలో ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశంపై విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రి కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిలీప్‌, సీనియర్‌ హృద్రోగ వైద్య నిపుణుడు, మెడికవర్‌ ఆసుపత్రుల సీఎండీ డాక్టర్‌ అనిల్‌కృష్ణల విశ్లేషణ, సూచనలివి.

పెను ప్రభావం
కరోనా కొత్త వేరియంట్‌ వల్లగానీ, ఇతర కారణాల వల్లగానీ రెండో దశలో ఎక్కువ మంది యువత బాధితులవుతున్నారు. లోగడ కరోనా సోకిన వారిలో వ్యాధి తీవ్రత పెరిగి సైటోకైన్‌స్టార్మ్‌ మొదలవడానికి వారం పది రోజులు పట్టేది. ఇప్పుడు 3,4 రోజులకే సైటోకైన్‌స్టార్మ్‌ మొదలవుతోంది. ఊపిరితిత్తులతోపాటు చాలా వ్యవస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చూస్తుండగానే పరిస్థితి చేయి దాటుతోంది. ఇప్పటికీ కరోనా మరణాల్లో అధిక శాతం ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే సంభవిస్తున్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్యా ఎక్కువే.
* కరోనా ప్రభావంతో ఏర్పడే సైటోకైన్ల ఉప్పెన వల్ల గుండె కండరాల పనితీరు దెబ్బతింటోంది. గుండె పరిమాణం పెరగడం, రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గడంతో చిన్న వయసువారిలోనూ ఒకలాంటి ఆయాసం వస్తోంది. గుండెపోటు సంభవిస్తోంది. దీన్ని వైరల్‌ మయోకార్డైటిస్‌ అంటారు. ఇది ఎక్కువగా కరోనాకు చికిత్స పొందుతున్న సమయంలో జరుగుతోంది.
* కొవిడ్‌ ఉన్నప్పుడు.. వైరస్‌ ప్రభావం తగ్గాక కూడా కొందరి రక్తనాళాల్లో రక్తపు గడ్డలు (థ్రాంబోసిస్‌) ఏర్పడుతున్నాయి. సూక్ష్మ రక్తనాళాల్లోనూ (కేశనాళికలు) గడ్డలు ఏర్పడుతున్నాయి. కొందరిలో మల్టిపుల్‌ థ్రాంబోసిస్‌ (అనేక రక్తనాళాల్లో గడ్డలు) సమస్య కనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా తగినంత జరగకపోవడం వల్ల మల్టిపుల్‌ థ్రాంబోసిస్‌ ఏర్పడిన వారిలో వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి.
* కరోనా వల్ల కొందరికి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఎక్కువ కాలం ఐసీయూలో ఉండటం కూడా దీనికి కారణం కావొచ్చు. ఆ గడ్డలు గుండెకు కుడివైపు వెంట్రికల్స్‌లోకి వెళ్లి అక్కడ బ్లాక్‌లు ఏర్పడటం వల్ల ఆ ప్రాంతం దెబ్బతింటోంది. దీనివల్ల గుండె ఎడమపక్క భాగానికీ రక్తం సరఫరా కావడం లేదు. ఇదీ గుండెపోటుకు కారణమవుతోంది. దీన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు.
* వీటన్నింటి ప్రభావం వల్ల గుండె రక్తం పంప్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌- ఈఎఫ్‌) తగ్గుతుంది. సాధారణంగా ఈఎఫ్‌ 65-70 శాతం ఉండాలి. ఈ సమస్య ఉన్నవారిలో అది 25-30 శాతమే ఉంటోంది. ఊపిరితిత్తుల నుంచి గుండెకు 100 మి.లీ. రక్తం సరఫరా అయితే.. దానిలో 65 శాతం రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు పంప్‌ చేయాలి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో అది 25-30 శాతానికి కూడా పడిపోతోంది. దీన్ని కార్డియోమయోపతి అంటారు. దీనివల్లా మరణాలు సంభవిస్తున్నాయి. ఈఎఫ్‌ శాతం పడిపోయిన వారికి చికిత్స కష్టమవుతోంది.

ముందుగానే మందులు ఇచ్చినప్పటికీ...!
రక్తనాళాల్లో పేరుకున్న క్లాట్‌ బద్దలైనప్పుడు డి-డైమర్‌ విడుదలవుతుంది. ఆరోగ్యవంతుల్లో డి-డైమర్‌ పరిమాణం 250కంటే తక్కువ ఉండాలి. కరోనా రోగులు కొందరిలో డి-డైమర్‌ పరిమాణం అనేక రెట్లు పెరిగిపోతోంది. అందుకే కరోనాకు వైద్యం మొదలుపెట్టినప్పుడే రక్తం గడ్డకట్టకుండా మందులూ ఇస్తున్నారు. డి-డైమర్‌ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి శరీరంలో రక్తం గడ్డకట్టే స్వభావాన్ని తెలుసుకోవచ్చు. కొందరిలో ముందుగానే రక్తం గడ్డకట్టకుండా మందులు వాడుతున్నా కూడా థ్రాంబోసిస్‌ ఏర్పడుతోంది. కరోనా వచ్చి తగ్గాక కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అందుకే కరోనా వచ్చి తగ్గాక కూడా 2,3 నెలలపాటు రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు ఇస్తున్నారు.

పరిస్థితి చేయిదాటాక వస్తున్నారు..

రోనా వచ్చిన తొలి రోజులకు, ఇప్పటికీ ఎలాంటి చికిత్స చేయాలన్న విషయంలో కొంత అవగాహన వచ్చింది. స్టెరాయిడ్లు, హెపారిన్‌, ఎకోస్ప్రిన్‌, రెమ్‌డెసివర్‌ వంటి మందులు వాడటం వల్ల థ్రాంబోసిస్‌ వంటి సమస్యలను, మరణాలను కొంత నివారించగలిగాం. కానీ వైరస్‌ ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటున్నందున శరీరంపై అది చూపే ప్రభావం, లక్షణాల్లోనూ మార్పు కనిపిస్తోంది. బాధితులు వ్యాధి లక్షణాల్ని వెంటనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, కొందరికి శరీరంలో వైరస్‌ ఉన్నా ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ రావడంతో తమకేమీ కాదన్న భరోసాతో ఉండటంతో వ్యాధి ముదురుతోంది. ఆ దశలో వారు ఆసుపత్రికి వస్తున్నారు. అప్పటికే వారి ఊపిరితిత్తులు 25-30 శాతం దెబ్బతింటున్నాయి. కొందరిలో అప్పటికే థ్రాంబోసిస్‌, మయోకార్డైటిస్‌ వంటి సమస్యలూ ఏర్పడుతున్నాయి. ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చినా.. వ్యాధి లక్షణాలుంటే వెంటనే సీటీ స్కాన్‌ చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణైతే.. డి-డైమర్‌ వంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో రక్తం గడ్డకట్టకుండా, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు మందులు వాడాలి. అవసరమైతే వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే కరోనాతో ఏర్పడే గుండె సమస్యలను నిరోధించవచ్చు. చివరి క్షణంలో రావడం వల్ల.. అసలు సమస్యకు చికిత్స చేయలేకపోతున్నాం. కరోనా వచ్చి తగ్గాక కూడా 2,3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులు వాడటంతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలూ చేయించుకోవాలి. : డా.దిలీప్‌, సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, ఆంధ్రా ఆసుపత్రి

కరోనా తగ్గినా అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం యువత ఎక్కువగా వైరస్‌బారిన పడటానికి కొత్త వేరియంట్‌ కారణం కావొచ్చు. చాలా మందిలో వ్యాధి నిర్ధారణ, చికిత్స ఆలస్యమవడం ప్రాణం మీదకు తెస్తోంది. సకాలంలో వైద్యం అందించనందున ఇతర అవయవాలతోపాటు గుండెపైనా ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే దాన్ని కరోనాగానే భావించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుత కరోనా వేరియంట్‌ను ఆర్టీపీసీఆర్‌లోనూ సరిగా గుర్తించలేకపోతున్నారు. వ్యాధి లక్షణాలుండి ఆర్టీపీసీఆర్‌లో మొదటిసారి నెగెటివ్‌ వస్తే.. రెండోసారి, అవసరమైతే మూడోసారి పరీక్ష చేయించుకోవాలి. కరోనా వచ్చి తగ్గినవారూ కొన్నాళ్లు అప్రమత్తంగానే ఉండాలి. థ్రాంబోసిస్‌ సమస్య ఆ తర్వాత కూడా వస్తోంది. ఇన్‌ఫ్లమేషన్‌ మార్కర్స్‌, డి-డైమర్‌ స్థాయిల్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. కరోనా వచ్చి తగ్గాక నడక, చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి. వ్యాయామం వల్ల డి-డైమర్‌ స్థాయి తగ్గుతుంది. పోషకాహారం తీసుకోవడమూ ముఖ్యం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు, పళ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. : అనిల్‌కృష్ణ, మెడికవర్‌ ఆసుపత్రుల సీఎండీ

ఇదీ చదవండి

సబ్బం హరి పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు

రాష్ట్రంలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.